Random Video

MS Dhoni Captaining In Asia Cup : BCCI Administrator Objected | Oneindia Telugu

2018-11-29 120 Dailymotion

As per the report, the official tried to stop MS Dhoni being made the interim captain for one match in the absence of captain Rohit Sharma and vice-captain Shikhar Dhawan during Asia Cup.
ఐసీసీ మహిళల వరల్డ్ టీ20 టోర్నీ భారత మహిళల జట్టులో చిచ్చు రేపింది. వెస్టిండిస్ వేదికగా జరిగిన మహిళల వరల్డ్ కప్‌ సెమీఫైనల్లో మిథాలీని తుది జట్టు నుంచి తప్పించడంపై చెలరేగిన వివాదం తారాస్థాయికి చేరుకోవడంతో పాటు బీసీసీఐ వద్దకు కూడా చేరింది. అదే సమయంలో తాజాగా ఇప్పుడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అంశం తెరపైకి వచ్చింది. దుబాయి వేదికగా ఇటీవల ముగిసిన ఆసియా కప్‌‌లో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు అతని స్థానంలో రోహిత్ శర్మ‌కి జట్టు పగ్గాలు అప్పగించారు. టోర్నీలో భాగంగా ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్)లకు జట్టు మేనేజ్‌మెంట్ విశ్రాంతినివ్వగా.... ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా ధోనిని కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అలా ధోని చేతికి మళ్లీ పగ్గాలు వెళ్లడంపై బీసీసీఐ పెద్దలు అప్పట్లో పెదవి విరిచినట్లు తాజాగా ఓ కథనం వెలుగులోకి వచ్చింది.
#dhoni
#AsiaCup
#BCCIadministrators
#2019worldcup
#MithaliRaj
#dhonicaptaincy